ఆత్మీయ సోదర సోదరీమణులకు,
అమ్మ తత్వ ప్రచారం లో భాగంగా ఈ సంవత్సరం కూడా అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన లో జిల్లెళ్లమూడి అమ్మ సేవా సమితి స్టాల్ నెలకొల్పటం జరిగింది. స్టాల్ లో అమ్మ సూక్తులు, సందేశముల ఫ్లెక్సీలసు ప్రదర్శసకై అలంకరించితిమి.
07-01-2018 ఆదివారం సాయంత్రం మన ఆత్మీయ సోదరులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు ప్రారంభోత్సవం చేశారు.
శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారి తో పాటు దీప ప్రజ్వలనం లో విశ్వజననీ పరిషత్ ముఖ్య కార్యదర్శి   శ్రీ వై.వి. శ్రీ రామమూర్తి గారు, శ్రీ దినకర్ గారు, జిల్లెళ్లమూడి అమ్మ సేవా సమితి అద్యక్షులు శ్రీ వియస్ఆర్ ప్రసాదరావు గారు పాల్గొన్నారు.
“అమ్మ”కు అష్టోత్తర శత నామ పూజ చేసి పులిహోర మొదలగు నవి నివేదన చేయబడినవి. పూజ లో శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారి కుటుంబ సభ్యులు సమితి సంయుక్త కార్యదర్శి శ్రీ  తంగిరాల రామమోహనరావు గారు, సభ్యులు శ్రీ కామరాజు గారు, శ్రీ టి.రామకృష్ణ గారు,   శ్రీమతి హైమ మొదలగువారు పాల్గొన్నారు. అనంతరం తీర్ధ ప్రసాద వినియోగం జరిగింది. సందర్శకులందరికి తీర్ధ ప్రసాదములతోపాటు, అమ్మ ను గురించిన కరపత్రములు, కుంకుమ పొట్లాలు. అమ్మవి చిన్న ఛాయాచిత్రాలను పంచితిమి. “అమ్మ” సినిమా ప్రదర్శించచితిమి.
“అమ్మ” స్టాల్ లో ఫిబ్రవరి 15 వరకు సాయంత్రం 6గంటల నుండి రాత్రి 8గంటలలోపు ఏ రోజైన ఏ కొంత సేపయినా సేవ చేసి “అమ్మ” కృపకు పాత్రులు కాగోరు సోదరులకు మా సాదర ఆహ్వానం.
ఇట్లు,
మీ ఆత్మీయ సోదరులు
జిల్లెళ్లమూడి అమ్మ సేవా సమితి, హైదరాబాద్.
error: Content is protected !!
svjp-logo

Subscribe To Arkapuri Newsletter

Join our mailing list to receive the latest news and updates from SVJP.

You have Successfully Subscribed!